భక్తి ఛానెల్ చైర్మన్‌గా సినీ నటుడు పృద్వీ నియామకం

సినీ నటుడు 'థర్టీ ఇయర్ ఇండ్రస్టీ' అంటూ చలన చిత్ర అభిమానులను కడుపుబ్బ నవ్వించిన నటుడు పృద్వీకి జగన్ కీలక పదవి ఇచ్చారు. తిరుమల శ్రీవారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌కు (ఎస్‌వీబీసీ) చైర్మన్‌గా నియమించారు. తనను నమ్మిన వాళ్లకు జగన్ న్యాయం చేస్తారని మరోసారి నిరూపించుకున్నారు. పృద్వీకి కీలక పదవి కట్టబెట్టడంతో తెలుగు చిత్ర పరిశ్రమ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. టీడీపీ హయాంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మన్‌గా దర్శకుడు రాఘవేంద్రరావు ఉన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. 2018లో ఛానల్ చైర్మన్‌గా రాఘవేంద్రరావు నియమితులయ్యారు. దేవస్థాన ధర్మకర్తల మండలిలో సభ్యులుగా ఉంటూ ఛానెల్ బాధ్యతలు కూడా నిర్వహించారు. రాఘవేంద్రరావు రాజీనామా చేసిన తర్వాత చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. ఇదే రంగానికి చెందిన పృద్వీకి చైర్మన్ పదవి ఇవ్వడం గమనార్హం.


Popular posts