వైస్సార్ సీపీ కార్యకర్తల మనో వేదన

 


వైఎస్ఆర్ పార్టీ సగటు కార్యకర్తల ఆవేదన


 దాదాపుగా తొమ్మిదిన్నర  ఏళ్లుగా పార్టీకి అండగా ఉండి,పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా దానిని తుచా తప్పకుండా విజయపథంలో నడిపించిన, నడిపిస్తున్నది కార్యకర్తలే.
ఇన్నేళ్లు అధికారం లేకున్నా అధికారంలో వేరే పార్టీ ఉన్నా పార్టీ గెలుపే లక్ష్యంగా చేసుకుని తమ తమ గ్రామలల్లో అధికార పార్టీ నేతలు ఎన్ని కష్టాలు పెట్టినా వాటన్నింటినీ ఎదుర్కొంటు తమ ఆస్తులు పోగొట్టుకుని అప్పులు పాలు ఐన ఎంతో మంది కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు... చివరకి తమ ప్రాణాలు సైతం పోగొట్టుకున్న కార్యకర్తలు ఉన్నారు మన రాష్ట్రంలో.
కూలీ పనులకు వెలితేగాని కుటుంబం గడవని పరిస్థితి ఉన్నా తమ నాయకుడు పిలుపునిచ్చాడు అని తమ పనులను సైతం విడిచి పెట్టీ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు.
ఇంతలా కష్టపడ్డ కార్యకర్తలు తమ పార్టీ వచ్చాకా కూడా ఆవేదన చెందుతున్నారు.
పార్టీ నాయకుల్లారా ఇది గమనించండి...నేడు మనం అధికారంలో ఉన్నాం కదా అని కష్టపడ్డ కార్యకర్తల ఊళ్లలోకి వెళ్లి మీ అధికార ఆజమాయిషి చేయకండి...అది ఎప్పటికీ పార్టీకి మంచి చేయదు.
పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తలకు తెలుసు మన గ్రామానికి ఏం చేయాలి,ఏం చేస్తే తమ గ్రామం అభివృద్ధి చెందుతుందని.
కార్యకర్తల ఆలోచలనకు విలువనిచ్చే వాడే నిజమైన నాయకుడు.
అలా కాకుండా కార్యకర్తల గ్రామాల్లోకి వెళ్లి అక్కడ కష్టపడ్డ కార్యకర్తలను విడిచిపెట్టి ,నేడు నాయకులకు మంచిగా వత్తాసు పలుకుతూ మరియు కార్యకర్తలకు వ్యతిరేకంగా పని చేసిన వారికి పనులు కట్టపెట్టడం సబబు కాదు... అది గ్రామ వాలంటారీ విషయంలో గానీ మరే ఇతర విషయంలో గానీ,ఇలా చేయడం వల్ల పార్టీ మొదటగా కార్యకర్తలను కోల్పోవాల్సి వస్తుంది.
పార్టీలో ఏళ్ల తరబడి కష్టపడ్డ వారిని కాకుండా రెండు మూడు నెలలకు ముందు పార్టీలోకి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అనే వాదన కూడా వినిపిస్తోంది...అలాకాకుండా అందరకీ ఒకే విధమైన ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.
 వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కార్యకర్తల మనోభావాలకు దెబ్బతగలకుండ , వారి ఆలోచనలకు విలువనిస్తు వారి వారి గ్రామాల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అని కోరుకుంటూ సగటు కార్యకర్త...
 నాయుకులు మీ యొక్క అధికార దర్పణం చుపెట్టుకోడం కోసం పక్క గ్రామాల్లో ఉన్న కొంత మంది నాయకులు ,కార్యకర్తలను పక్కన పెట్టుకుని తిరుగుతూ, ఆ గ్రామాల్లో ఉండే మన పార్టీ నాయకుల మీద,కార్యకర్తల మీద పెత్తనం చెలాయించడం సరైన పద్దతి కాదు...


 ఏదైనా ఒక గ్రామం అభివృద్ధి విషయంలో నిర్ణయం ఆ గ్రామ నాయకులు,కార్యకర్తలకు వదిలేయండి...అంతేగానీ పక్క గ్రామంలోని నాయుకులు ఆ గ్రామం విషయంలో తలదుర్చడం ఎంత వరకు సమంజసం.
ఇది ఇలానే కొనసాగితే వచ్చే స్థానిక సంస్థాగత ఎన్నికల్లో తీవ్ర నష్టం చవిచూడాల్సి వస్తుంది.