నిరుద్యోగులను ఆదుకోవాలి

రాష్ట్రంలో కోటి 72 లక్షల మంది నిరుద్యోగులున్నారని వారందరికీ తాను అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇస్తానని నమ్మించి అధికారంలోకి వచ్చారు జగన్ గారు. వచ్చీ రాగానే నాలుగు లక్షల గ్రామవాలంటీర్లు, నెలకు 5,000ల జీతం అనగానే పోనీలే గ్రామీణ యువతకు ఉపాధి దొరికిందనుకుంటే...


నాలుగు రోజులు తిరిగేసరికి తూచ్! 1,84,498 మందికే గ్రామవాలంటీర్ పోస్టులన్నారు.


చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నంలే అనుకుంటే... ఆ పోస్టులన్నీ వైసీపీ కార్యకర్తలకే ఇచ్చుకుంటూ సాధారణ యువతతో ఉత్తుత్తి ఇంటర్వ్యూల పేరిట ఆడుకుంటున్నారు. 
ఇప్పుడు ఇక గ్రామసచివాలయాలలో 91,652 ఉద్యోగాలంట, రాష్ట్రమంతా సర్కారీ మధ్య షాపులంట... వాటిలో ఒక్కో  దాంట్లో ముగ్గురు సేల్స్‌ మెన్లు, ఒక సూపర్‌వైజర్‌ ఉంటారంట. వీటినైనా మామూలు యువతకు ఇస్తారా? లేక వీటినీ వైసీపీ నేతలే అమ్ముకుంటారా అని సందేహిస్తోంది యువత.


Popular posts