ఉద్యోగ భద్రత కల్పించాలి

మాకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ మండల మహిళా సమాఖ్య అకౌంటెంట్స్


మాకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ మండల మహిళా సమాఖ్య అకౌంటెంట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. తాడేపల్లి మండల మహిళా సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా చేరుకుని మాకు కనీస వేతనం చెల్లించాలంటూ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.. కనీసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఆరు వందల ముప్పై ఐదు మంది మండల సమాఖ్య కార్యాలయం లో అకౌంటెంట్ గా గత 15 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నామని ప్రజలకు ప్రభుత్వం ద్వారా చేకూర్చే లబ్ధి అన్ని మండల మహిళా సమాఖ్య ద్వారా నిర్వహిస్తున్నామని వారు తెలియజేశారు. వర్షాన్ని సైతం కూడా లెక్కచేయకుండా మండల మహిళా సమాఖ్య అకౌంటెన్సీ వర్షంలో నిలబడే నినాదాలు చేశారు..