జులై 15 నాటికి గ్రామ సచివాలయ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్..
పంచాయతీరాజ్‌శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ అధికారులు హాజరయ్యారు. సమీక్ష ముగిసిన తర్వాత మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 2నుంచి గ్రామ సచివాలయాల ప్రారంభానికి చర్యలు చేపడతామని చెప్పారు. జిల్లా యూనిట్‌గా డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల భర్తీకి జులై15 నాటికి నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. ప్రతి 2 వేల మందికి గ్రామ సచివాలయం, 10 మంది వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లను డీఎస్‌సీ ద్వారా ఎంపిక చేస్తామని చెప్పారు. రెండేళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు
జులై 15 నాటికి గ్రామ సచివాలయ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్