పంచాయతీ ఎన్ని "కల"లేనా...!

పంచాయతీ ఎన్ని "కల"లేనా...!


ఆంద్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న అసావాహులకు ప్రభుత్వం మరింత ఉత్కంఠ చూపుస్తుంది.ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయిన విషయం తెలిసిందే.


ఒక్క రిజర్వేషన్లు మినహా మిగతా ప్రక్రియ అంత అధికారులు రెండు నెలల నుంచి పూర్తి చేశారు.అన్ని
సక్రమంగా ఉంటే గత నెల చివర్లో నోటిఫికేషన్ వస్తుంది అని ప్రచారం జరగగా,ప్రభుత్వం మాత్రం ఎన్నికలు నిర్వహించడానికి సహసించడం లేదని విశ్వసనీయ సమాచారం.సార్వత్రిక ఎన్నికల్లో జోరుగా ఉన్న అధికార పార్టీ,పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం కొన్ని నెలలు ఆగక పంచాయతీ నిర్వహిద్దామని ఉన్నారని భోగట్టా.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఎన్నికలు పెట్టని కారణంగా విడుదల కాలేదు. ఇంకా జాప్యం చెయ్యడం వలన గ్రామాల అభివృద్ధికి కుంటు పడటమే కాకుండా ప్రభుత్వం పై కూడా విమర్శలు వస్తాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనా ఎంత తొందరగా పంచాయతీ నిర్వహిస్తే ఈ ప్రభుత్వానికి ప్రజల్లో అంత మంచి పేరు వస్తుందని క్షేత్రస్థాయిలో ఉన్న అధికార పార్టీ నాయకులు వారి మనసులో మాట తెలియజేస్తున్నారు.ఇప్పుడున్న పరిస్థితి లో ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రంలో గెలుపు ఒకే విధంగా ఉంటుందని, అధికార పార్టీ పొలిటికల్ సలహాదారు ప్రశాంత్ కిషోర్ కొంతమంది వైసీపీ నాయకులు దగ్గర చెప్పారని సమాచారం.మరి కొద్ది రోజుల్లో పంచాయతీ సంగ్రామం ప్రారంభం అవుతుందని ,జులై చివరి వారంలో నోటిఫికేషన్ కూడా విడుదలైన ఆకాశం ఉందని ,అమరావతి సర్కిల్లో వినిపిస్తున్న బహిరంగ వార్త,ఎం జరుగుతుందో జులై నెలాఖరు వరకు వేచి చూడాలి.


Popular posts
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సీమాంధ్రుల కలల రాజధాని కోసం ఉద్యమిస్తాం*
Image
రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుం ది
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో