అంటువ్యాధులను నిరోధించేందుకు కృషి చేయాలి

 


అంటువ్యాధులను నిరోధించేందుకు కృషి చేయాలి
- వైద్య రంగంలో మైలురాయిగా నిలిచిన భాస్కర్ కుమార్
- వెల్లూరు ప్రొఫెసర్ డా. జార్జ్ ఎం వర్గీస్


విజయవాడ: దేశంలో కొత్తగా బయటపడుతున్న అంటువ్యాధులను సమర్థంగా నిరోధించడానికి వైద్యులంతా కృషి చేయాలని వెల్లూర్ సీఎంసీ ప్రొఫెసర్. డా. జార్జ్ ఎం వర్గీస్ పిలుపునిచ్చారు. విజయవాడలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఆదివారం జరిగిన డా. పీఎస్. భాస్కర్ కుమార్ మెమోరియల్ వార్షిక సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా కృష్ణా జిల్లా విభాగం, ఐఎంఐ బెజవాడ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ''ఎమర్జింగ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ఇండియా'' అనే అంశంపై ప్రసంగించారు. వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి అంటువ్యాధులు ప్రబలుతాయని, వాటిని నిరోధించేందుకు వైద్యులు నిరంతరం అధ్యయనం చేస్తుండాలని సూచించారు. ఈ సందర్భంగా డా. పిండిప్రోలు శ్రీనివాస భాస్కర్ కుమార్(పీఎస్ భాస్కర్ కుమార్) వైద్యరంగంలో చేసిన విశేష కృషిని గుర్తు చేసుకున్నారు. వైద్య వృత్తిలో భాస్కర్ కుమార్ అనేక ఎత్తులను అధిరోహించారని కొనియాడారు. చిత్తూరు జిల్లా మదనపల్లె, కాకినాడ జీజీహెచ్, విజయవాడ, కొవ్వూరుల్లోని టీబీ పరిశోధనా కేంద్రాల్లో ఆయన విశేష సేవలందించారని తెలిపారు. అలాగే విజయవాడ ఈఎస్ఐలో సివిల్ సర్జన్ గా పని చేసినప్పుడు ఆయన దగ్గర వందలాది మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించారని అన్నారు. 1990-91 సమయంలో భాస్కర్ కుమార్ ఐఎంఏ విజయవాడ చాప్టర్ అధ్యక్షుడిగా పనిచేశారని గుర్తు చేశారు. ఏపీఏ వ్యవస్థాపక సభ్యుడిగా అనేక సీఎంఈ కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. వైద్యం కోసం ఎవరైనా పేదలు ఎదురు చూస్తుంటే వారికి చికిత్స అందించడంతో పాటు మందులను సైతం అందజేశారని, ఈ తరం వైద్యులంతా ఆయన స్ఫూర్తిని పుణికి పుచ్చుకోవాలని వర్గీస్ పిలుపునిచ్చారు. భాస్కర్ కుమార్ క్రీడలు, కళలు, కవిత్వంలోనూ ప్రవేశమున్న వారని, ఆయనలా అనేక రంగాల్లో ప్రతిభ చూపేవారు అరుదని కొనియాడారు. వైద్యరంగంలో భాస్కర్ కుమార్ చేసిన సేవలు చిరస్మరణీయమని, నిజాయితీపరుడిగా, పేదల పక్షపాతిగా ఆయన పొందిన పేరు ఈ తరం వైద్యులకు ఆదర్శనీయమని వివరించారు. అనంతరం ఐఎంఏ విజయవాడ చాప్టర్ అధ్యక్షులు డా. టీవీ రమణమూర్తి, గౌరవ కార్యదర్శి డా. సీహెచ్ మనోజ్ కుమార్, ఏపీఐ కృష్ణా జిల్లా చైర్మన్ డా. కె. సుధాకర్, కార్యదర్శి డా. జి. చక్రధర్ మాట్లాడుతూ డా. భాస్కర్ కుమార్ వైద్యరంగంలో వేసిన బాటలు తమందరికీ ఆదర్శనీయమని అన్నారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు.


Popular posts
టి ఆర్ ఎస్ కి ఆదరణ పెరుగుతుంది
Image
శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని వెంకటేశ్వర కాలనీ లో ఈరోజు బస్తీ దవాఖానను ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు పేద ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనలో భాగంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు దవాఖానాలు చేరువయ్యేలా ఉండాలని ప్రభుత్వ సంకల్పంతో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ ఒక్క రోజు లో జి.హెచ్.యం.సి పరిధి లో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్ -22, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 05, సంగారెడ్డి జిల్లాలో 03 బస్తీ దవాఖానాల ప్రారంభం ప్రస్తుతం జి.హెచ్.యం.సి పరిధిలో 123 బస్తీ దవఖానాలు ప్రతిరోజూ 10 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయి. నూతనంగా ప్రారంభించే 45 బస్తీ దవాఖానాల తో అదనంగా 4 వేల మందికి వైద్య సేవలు అందుతాయి. ఒక్కో బస్తీ దవఖాన లో ఒక వైద్యుడు, ఒక నర్స్, ఒక సహాయకుడు ఉంటారు. ప్రతి ఒక్కరు బస్తీ దవాఖాన సేవ‌ల‌ను వినియోగించుకోవాలి. బస్తీ దవాఖానల్లో ఆధునిక వైద్య పరికరాలు ఉంటాయి. పేద,మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఈ దవాఖానాలు ఉంటాయి. మన తెలంగాణ ను ఆరోగ్య తెలంగాణ గా మార్చుకుందాం. ఈ కార్యక్రమం లో కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు,యం.యల్.సి నవీన్ రావు గారు,యం.యల్.ఏ అరెకపూడి గాంధి గారు తదితరులు పాల్గొన్నారు.
Image
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కె డి సి సి బ్రాంచ్ ప్రారంభం