బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు ఇవే..
కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు నామామాత్రంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో.. ఏపీ, తెలంగాణలలోని యూనీవర్సిటీలకు కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయో తెలిపారు. ఏపీలోని సెంట్రల్ వర్సిటీకి రూ.13 కోట్లు మరియు ఏపీ ట్రైబల్ వర్సిటీకి రూ. 8కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. అదే విధంగా తెలంగాణలోని హైదరాబాద్ ఐఐటీకి రూ.80 కోట్లు కేటాయించినట్లు ఆమె తెలిపారు.
బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు