*బ్రేకింగ్ న్యూస్*
సీఎంగా ప్రమాణం చేసిన నిమిషాల్లోనే యడియూరప్ప సంచలన నిర్ణయం
బెంగళూరు : సీఎంగా ప్రమాణం చేసిన నిమిషాల్లోనే యడియూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు.
కుమార స్వామి సీఎంగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలను నిలుపుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
కుమార స్వామి ప్రభుత్వం జూలై వరకు తీసుకున్న నిర్ణయాలను నిలుపుదల చేయాలని ఆదేశించారు, ఆయన లేదా సీఎస్ వాటిని సమీక్షించిన తర్వాతే అమలు చేయాలి' అంటూ యడియూరప్ప తనను ఆదేశించారని సీఎస్ విజయ్ భాస్కర్ అన్ని శాఖలకు తెలిపారు.