రేణిగుంటలో స్పైస్ జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

రేణిగుంటలో స్పైస్ జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్రేణిగుంట నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానానికి ముప్పు తప్పింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ల్యాండ్ అయిన కొద్ది సేపటికే నిలిచిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులు తీవ్ర అందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదాన్ని ముందే గుర్తించిన పైలట్ విమానాన్ని సేఫ్ గా రన్ వే పైనే ల్యాండ్ అయ్యేలా నిలిపాడు. అలా గుర్తించకపోయి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు అంటున్నారు.  విమానంలో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.