టీడీపీ మైనార్టీ కార్యకర్త జీవన ఉపాధి పై  వేటువేసిన నంద్యాల వైసీపీ నాయకులు

 


వైసీపీ కండువా కప్పుకోలేదని టీడీపీ మైనార్టీ కార్యకర్త జీవన ఉపాధి పై  


వేటువేసిన నంద్యాల వైసీపీ నాయకులు


నంద్యాల పట్టణంలోని స్థానిక టెక్కే ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన మార్కెట్ యార్డు కలదు. సేవ పేరుతో ప్రజలకు మభ్య పెడుతూ యార్డుకు సంబంధించిన రూములు తన సొంత వ్యాపారం కోసం తక్కువ అద్దెతో కొన్ని ఏళ్ళు లీజుకు తీసుకుని పబ్బం గడుపుతున్నారు...


ఇదే క్రమంలో భాగంగా పక్కనే ఎవరికి అడ్డులేకుండా ఉన్న స్థలంలో  అప్పటి మార్కెట్ యార్డ్ కు సంభందించిన మంత్రి గారి అనుమతితో చిన్న బంకు పెట్టుకొని ఆటోలకు గ్యాస్ వెల్డింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న షేక్ ఈలియస్ (సైలబ్) టీడీపీ కార్యకర్తను వైసీపీలోకి రావాలని లేదంటే నీ యొక్క జీవన ఉపాధి ఉన్న బంకును ఎత్తివేస్తామని బెదిరిస్తుంటే అతను వెంటనే వైసీపి లో ఉన్న నాయకులను తన వార్డు కౌన్సిలర్ ను సైతం సంప్రదించి పొట్టకూటి కోసం పెట్టుకున్న ఉపాధిని తొలగించవద్దని రాజకీయాలు చేయొద్దని ప్రాధేయపడ్డారు అయిన కనీస మానవత్వం లేకుండా నువ్వు వైసీపీ కండువా వేసుకుంటేనే నీకు అ స్థలంలో నువ్వు ని జీవనాన్ని సాగించుకోవచ్చునని ఆలోచించుకోవలసిందిగా చెప్పి గత కొన్ని రోజులుగా మానసిక భాదకు గురిచేశారు.


28/07/2019 అనగా ఈరోజు మార్కెట్ యార్డులో పనిచేసే సుమారు 30 మంది 
ని పంపించి బంకును తొలగించండి లేదు అంటే బలవంతగా తీసివేయ్యవలసి వస్తుందని హెచ్చరించారు తప్పని పరిస్థితుల్లో గొడవలు ఎందుకని సైలబ్ గారు బంకును తీసివేశారు  టీడీపీ మైనారిటీ కార్యకర్త సైలబ్ ను
ఎన్నో ఇబ్బందులకు గురిచేసిన ఎన్ని ప్రలోభాలకు పెట్టిన లొంగకుండా తన జీవన ఉపాధిని కోల్పోయారు..


నోట్ ఈలియస్ (సైలబ్)నంద్యాల పట్టణంలోని 7వ వార్డులో గత 20సంవత్సరాలుగా మైనార్టీ వర్గంలో బలమైన కార్యకర్తగా గత తనకంటూ ఒక ప్రత్యేకను ఏర్పర్చుకున్నారు.. 


Popular posts