సెర్బియా పోలీసుల అదుపులో నిమ్మగడ్డ.. కేంద్ర మంత్రికి వైసీపీ ఎంపీల లేఖ
సెర్బియా పోలీసుల అదుపులో నిమ్మగడ్డ.. కేంద్ర మంత్రికి వైసీపీ ఎంపీల లేఖ

 

 తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌‌ను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాన్‌పిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రస్ అల్ ఖైమా ఫిర్యాదుతో బెల్‌గ్రేడ్‌లో నిమ్మగడ్డను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వాన్‌పిక్ వాటాల వ్యవహారంలో నిమ్మగడ్డపై రస్ అల్ ఖైమా ఫిర్యాదు చేశారు.

 

సెర్బియాలో విహారయాత్రకు వెళ్లగా అక్కడే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే నిమ్మగడ్డను భారత్‌కు తీసుకువచ్చేందుకు వైసీపీ ఎంపీల ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు సెర్బియాతో సంప్రదింపులు జరపాలంటూ విదేశాంగమంత్రి జైశంకర్‌కు వైసీపీ ఎంపీలు లేఖ రాశారు. కాగా.. నిమ్మగడ్డకు వైసీపీ అధినేత,ఏపీ సీఎం  వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డితో మంచి సంబంధాలున్న సంగతి తెలిసిందే.

Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన