పదో తరగతి మెరిట్ విద్యార్ధులకు నగదు ప్రోత్సాహకాలను అందించిన ఎమ్మెల్యే సింహాద్రి. దివిసీమ భీంజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇద్దరు పదో తరగతి మెరిట్ విద్యార్ధులకు రూ.20వేలు నగదు ప్రోత్సాహకాలను ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అందజేశారు. కోటగిరిలంక ఆర్.సీ.ఎం ఛర్చిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో స్థానిక ప్రభుత్య ఉన్నత పాఠశాలలో పదికిపది జీపీఏ సాధించిన చిరాల జయశ్రీకి రూ.10వేలు, ఆర్.సీ.ఎం హైస్కూల్ లో 9.8 సాధించిన ఎం.దివ్యవాణికి రూ.10వేలుని ఎమ్మెల్యే సింహాద్రి, చర్చి ఫాదర్ గోళ్ల విజయకుమార్ అందజేశారు. ఈ సంధర్భంగా సింహాద్రి మాట్లాడుతూ పేద విద్యార్ధుల చదువుకు తోడ్పాటు నందించేందుకు యువకులు ముందుకు రావడం మంచి పరిణామం అన్నారు. దివిసీమ భీంజీ అసోసియేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పొలాబత్తిన బిపిన్ చంద్రపాల్ ని ఎమ్మెల్యే అభినందించారు. ప్రతి విద్యార్థి చదువుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మబడి పథకం ప్రవేశ పెట్టారన్నారు. ఈ పథకం విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పును తీసుకు రానుందని చెప్పారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించి పాఠశాలల అభ్యున్నతికి తల్లిదండ్రులు తోడ్పాటు నందించాలి అన్నారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే సింహాద్రి ఫాదర్ విజయ్ కుమార్ ని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు గోపాలం ప్రధాన కార్యదర్శి దిడ్ల ప్రసాద్, ఆర్.సి.యం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిస్టర్ ఆన్సీ వర్గీస్. సుపీరియర్ సిస్టర్ మేరీ ఆంటోనీ, సభ్యులు నాదెళ్ల జేమ్స్, ఆరిగ బుచ్చిబాబు, పర్చూరి శ్రీనివాసరావు పాటు పలు సంఘ పెద్దలు పాల్గొన్నారు.
మెరిట్ విద్యార్థులకు ప్రోత్సహకాలు