విశాఖ జిల్లా,వి.మాడుగుల మండలం కొత్తవలస గ్రామములో జనపరెడ్డి దేవి అనే గర్భిణీ స్త్రీకి అత్యవసర పరిస్థితి లో ప్రసవ సమయం కావటం తో హుటాహుటిన డోలీలో తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది.
దాదాపు 5 కిలోమీటర్లు కుటుంబసభ్యులు గ్రామస్తులు కలసి డోలీలో తీసుకొని వచ్చారు.అక్కడ నుంచి 108 లో కేజే పురం ఆసుపత్రికి తరలించ్చారు.ప్రస్తుతం తల్లి,బిడ్డ క్షేమంగానే ఉన్నారు.
బాధితురాలి భర్త మాట్లాడుతూ రోడ్డు సదుపాయం లేక ఏ పరిస్థితి ఏర్పడిందని కొంచెం ఉంటే తల్లి,పిల్ల ఇద్దరికి ప్రమాదం జరిగేదని.మాకు జరిగిన కష్టం వేరేవారికి ఎవ్వరికి జరగకూడదని ఆయన అంటున్నాడు.
గర్భిణీలకు సౌకర్యాలు కల్పించండి