బిట్రగుంట లో రైల్వే పరిశ్రమ -  నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి


 


బిట్రగుంట లో రైల్వే పరిశ్రమ -  నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి


 


 కావలి నియోజకవర్గ పరిధిలో ఉన్న బిట్రగుంట లో ఏదో ఒక రైల్వే పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి తెలిపారు పన్నెండు వందల ఎకరాల రైల్వే భూమి తో పాటు మౌలిక సౌకర్యాలు  అక్కడ  ఉన్నాయని పేర్కొన్నారు. అక్కడ ఒక రైల్వే  పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సంబంధిత మంత్రి తో మాట్లాడానని తెలిపారు. ఈ విషయాన్ని ఈ పార్లమెంట్ సమావేశాల్లో కూడా ప్రస్తావించి తుది నిర్ణయానికి కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. తద్వారా జిల్లాకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


కావలిఆత్మకూరులలో    వచ్చే ఏడాది కేంద్రీయ విద్యాలయాలు


 వచ్చే ఏడాది కావలి, ఆత్మకూరులో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నానని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదివారం  ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నామని , సంబంధిత మంత్రితో కలిసి మాట్లాడినప్పుడు ఈ మేరకు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. నెల్లూరులోని కేంద్రీయ విద్యాలయం లో గతంలో  ఎంపీ కోటా కింద పది సీట్లు మాత్రమే కేటాయించే వారని, ఈ ఏడాది సంబంధిత మంత్రి తో మాట్లాడి దానిని 25కు పెంచడం వల్ల ఎక్కువమంది జిల్లా విద్యార్థులకు లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. నెల్లూరు లోక్సభ పరిధిలోని కందుకూరు  లో గతంలో కేంద్రీయ విద్యాలయం మంజూరైనా అజ్ఞాతంలో ఉండి పోయింది అని తెలిపారు. దానిని సంబంధిత మంత్రి తో మాట్లాడి ఈ ఏడాది ప్రారంభింపజేశామని తెలిపారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో జిల్లాకు సంబంధించిన పలు సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నానని  పేర్కొన్నారు. ఇందుకుగాను తోటి ఎంపీ లను కూడా కలుపుకొని ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అలాగే రింగ్ రోడ్డు, రామాయపట్నం బీచ్ రోడ్లకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు .