రాష్ట్రం పట్ల,  సమస్య ల పట్ల అంకింతభావం

 


 


 బాబుగారి గంట ప్రసంగం అసెంబ్లీలో  విన్న తరువాత జగన్మోహన్ రెడ్డి గారికి వారి   ఎం ల్ ఏ లకు చెప్పాలనుకున్న సలహా.ఇంత కన్నా  ఆంధ్రప్రదేశ్  జలవనరులు గురించి  చెప్పగలిగే  మనిషి  ఒక్కడైనా ఉన్నారా?  ఇంత ఓపిక గా అసెంబ్లీలో చెప్పే  ప్రతిపక్ష, అధికార నాయకులు  ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ నైసర్గిక పరిస్థితి  ఔపోశన పట్టిన మహర్షి. నేర్చుకోవాల్సిన  అవసరం  ప్రతి ఒక్కరికీ ఉండాలి. ఇంత బాగా  జాగ్రఫీ  చదివినవారు,  ఇంజనీర్లు  కూడాచెప్పలేరు.  ఎంత నిర్ధిష్టమైన ప్రణాళిక  ఉంది  ఆయనకు  రాష్ట్ర ప్రయోజనాల పట్ల గమనించండి.  ఏదో తూతూ మంత్రంగా పరిపాలించాలనుకొంటే ఇదంతా చెప్పేవారా?  ఆయన ముసలాడా  మీరు ముసలోళ్ళా?  బుల్లెట్ దింపటం లాంటి  భాష  కాదు మన నీటిపారుదల శాఖామంత్రి  మాట్లాడాల్సింది. సబ్జెక్టు పట్ల అవగాహన కావాలి. అసెంబ్లీ  సమావేశాల్లో   చంద్ర బాబు గారి ని  అవహేళన చేయటానికి  ఎంత సమయం వృధా చేసారు!!  రాష్ట్రం పట్ల,  సమస్య ల పట్ల శ్రద్ధ    కమిట్మెంట్ ఉన్న బాబుగారు నుండి నేర్చు కోవలసింది  చాలా  ఉంది.
అంకింతభావం ఉంటే  బాగుచేయండి రాష్ట్రాన్ని అంతేగాని  కించపరిచే మీ బుద్దులని బయట వేసుకోకండి.