నెల్లూరు సెంట్రల్ బ్యాంకు మాజీ చైర్మన్, ఇందుకూరుపేట సమితి మాజీ అధ్యక్షుడు, వీఆర్ విద్యాసంస్థల కమిటీ మాజీ అధ్యక్షుడు ఆనం భక్తవత్సలరెడ్డి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ మంత్రివర్యులు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నెల్లూరు రూరల్ మండలం సౌత్ రాజుపాళెంలో భకవత్సలరెడ్డి పార్ధివ దేహానికి నివాళులర్పించిన సోమిరెడ్డి
ఆనం కుటుంబీకులకు పరామర్శ..
సోమిరెడ్డి కామెంట్స్
భక్సవత్సలరెడ్డి అంటే జిల్లాలో ఒక బ్రాండ్..
సెంట్రల్ బ్యాంకు కేంద్రంగా సుదీర్ఘ కాలం రాజకీయాలు నడిపారు.
రాజగోపాల్ రెడ్డి, భక్సవత్సలరెడ్డి క్లాస్ మేట్స్. రాజుపాళెం మా పొరుగు గ్రామం కావడంతో మా కుటుంబాలు సన్నిహితంగా ఉండేవి.
భకవత్సలరెడ్డి మంచి నాయకుడు, సౌమ్యుడు, పది మందికి సాయం చేసిన మంచి వ్యక్తి...మచ్చలేని రాజకీయ జీవితం నడిపారు..భక్తవత్సలరెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుడిని ప్రార్ధిస్తున్నా..వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా..