హాస్టల్ విద్యార్థులతో కలసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థుల వైపే నేను...  అనంతపురం జిల్లా కలెక్టర్


 విద్యార్థుల ప్రగతి వైపే అన్ని చర్యలు తీసు కొంటా నని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి అనంతపురం పట్టణంలోనిఎస్.సి బాలుర వసతి గృహం 4ను ఆకస్మి కంగా తనిఖీ హాస్టల్ విద్యార్థులతో కలసి భోజనం చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు కు మంచి పిల్లలు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నదని లేనిది అడిగి తెలుసు కున్నారు. అంతేకాకుండా విద్యార్థులతో కలసి భోజనం చేసి పిల్లలకు వడ్డించే ఆహార పదార్థాలను రుచి చూసారు. బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.