చంద్రబాబు ఆస్తులకు రక్షణ కల్పించడం  కుదరదు - హోం మంత్రి సుచరిత 

చంద్రబాబు ప్రైవేట్ ఆస్తులకు రక్షణ కల్పించడం  కుదరదని చెప్పిన హోం మంత్రి సుచరిత 


 


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా తానే సీఎం అనే అపోహలో ఉన్నారని ఏపీ హోం మంత్రి సుచరిత అన్నారు. ప్రతిపక్ష నేతను అనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని మంత్రి సూచించారు. చంద్రబాబుకు భద్రత తగ్గించామనడం వాస్తవం కాదనిస్పష్టం చేశారు. చంద్రబాబుకు బుల్లెట్ ప్రూఫ్, ఎస్కార్ట్ కార్లు ఇచ్చామని తెలిపారు.


సెక్యూరిటీ రివ్యూ చెప్పిన దాని కంటే ఎక్కువ భద్రతే కల్పించామని స్పష్టం చేశారు. వాస్తవానికి చంద్రబాబు భద్రతకు 58 మందినే కేటాయించాలి కానీ, 74 మంది ఆయన భద్రత గా ఉన్నారని వివరించారు. ప్రతి విషయం రాజకీయం చేయడం తగదని అన్నారు. అదనపు భద్రత కల్పించాలని చంద్రబాబు కోరితే కల్పిస్తామని తెలిపారు. చంద్రబాబు ప్రైవేట్ ఆస్తులకు రక్షణ కల్పించడం మాత్రం కుదరదని హోం మంత్రి స్పష్టం చేశారు.


Popular posts