హాస్టల్ ఫీజులు తగ్గిచాలంటూ TISS విద్యార్థుల నిరహార దీక్ష

హాస్టల్ ఫీజులు తగ్గిచాలంటూ TISS విద్యార్థుల నిరహార దీక్ష


హాస్టల్ ఫీజులు తగ్గిచాలంటూ టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హైద్రాబాద్ ఆఫ్ క్యాంపస్ లోని (TISS) స్టుడెంట్స్ నిరహార దీక్ష చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని బ్రహ్మణ్ పల్లి రోడ్ లో ఉన్న TISS-Hyderabd క్యాంపస్ లో దాదాపు 500 మంది స్టుడెంట్స్ వివిద రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఉన్నారు. వీరు బీఏ, ఎంఏ, ఎంఫిల్ పీహెచ్డీ  కోర్సులు చదువుతున్నారు. ఇందులో అన్ని సామాజిక వర్గాల వారు, ఆర్థికంగా వెనకబడిన వారు చదువుకుంటున్నారు.


అయితే ఈ ఎకాడమిక్ స్టాటింగ్ లో ఓ ప్రైవేట్ సంస్థకు హాస్టల్ నిర్వహణ బాధ్యతలను ఎలాంటి టెండర్ లేకుండా TISS అప్పగించిందని విద్యార్థులు తెలిపారు. దీంతో ప్రతీ ఒక్క విద్యార్థి 54వేల రూపాయలను కడితేనే హాస్టల్ లో ఉండనిస్తామని సదరు ప్రైవేట్ సంస్థ  విద్యార్థులను వేధిస్తున్నట్టు చెప్పారు. పెంచిన హాస్టల్ ఫీజులను వెంటనే తగ్గించాని కోరారు విద్యార్థులు.


గత సవంత్సరం నెల ఫీజును కట్టడానికి కొంత సమయం ఇచ్చేవారని… ఈ సంవత్సరం నుంచి… ముందే కట్టాలంటున్నారని చెప్పారు విద్యార్థులు. వారం రోజులనుంచి విద్యార్థులు నిరసన చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థులు తెలిపారు. శుక్రవారం నుంచి 8మంది స్టుడెంట్స్ తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు నిరహార దీక్ష చేస్తున్నట్లు చెప్పారు.