సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి గారు ఈ అర్థరాత్రి 1:28 లకు
హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.
జైపాల్ రెడ్డి పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా మాడుగుల మండల కేంద్రంలో 16 జనవరి 1942 లో జన్మించారు.
విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై మక్కువ ఎక్కువ..
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో MA ఇంగ్లీష్ లిటరేచర్,BCJ అభ్యసించారు.
OUలో విద్యార్థి నాయకుడిగా ఉంటూ...
1969లో తొలి సారి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు.
1969 నుంచి 1984 దాకా జనతా పార్టీ అభ్యర్థి గా కల్వకుర్తి ఎమ్మెల్యే గా గెలుపొందుతూ వచ్చారు. 1984 లో తెలుగుదేశం పార్టీ పొత్తు తో మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడిగా మొదటిసారి విజయం సాధించారు.
1998లో కూడా మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచారు.
అనంతరం 1999 2004 సంవత్సరాలలో మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలుపొందారు. 2009లో చేవెళ్ల స్థానం నుంచి పోటీ చేసి మరోసారి ఎంపీగా విజయం సాధించారు.
1991 లో రాజ్యసభ సభ్యుడిగా కూడా జైపాల్ రెడ్డి కొనసాగారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం.. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేశారు.
2004 ..2009 కాంగ్రెస్ హయాంలో కూడా కేంద్రమంత్రిగా జైపాల్ రెడ్డి పనిచేశారు.
భార్య.. ఇద్దరు కొడుకులు ఒక కూతురు.