తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులకై కసరత్తు
ప్రతిష్ఠాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి సుబ్బారెడ్డికి కేటాయించటంతో సభ్యులుగా అవకాశం ఇవ్వాలని పలువురు పార్టీ నేతలు సీఎం జగన్‌ను అభ్యర్దిస్తున్నారు. ఇప్పటికే బొల్లా బ్రహ్మనాయుడు.. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేర్లు జగన్ ఖరారు చేసినట్లు చెబుతున్నారు. తూర్పు గోదావరి నుండి రౌతు సూర్యప్రకాశ రావు లేదా తోట వాణిల్లో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. గన్నవరం నుండి పోటీ చేసిన వెంకట్రావు సైతం తనకు అవకాశం ఇవ్వాలని జగన్‌ను కలిసి కోరారు. అనంతపురం నుండి మహిళా ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వనున్నారు. తెలంగాణ కోటాలో జూపల్లి రామేశ్వరరావు పేరు ఖరారైనట్లు చెబుతున్నారు. అదే విధంగా మహారాష్ట్ర..తమిళనాడు.. కర్నాటక నుండి ఒక్కొక్కరికి అవకాశం దక్కనుంది. ఈ లిస్టు సైతం త్వరలోనే ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది.