పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను గుర్తించండి

 


గ్రామ స్థాయి నుంచి ఏ ఎలక్షన్స్ వొచ్చినా ఏ సమస్య వచ్చినా వాటిని పరిష్కరించాల్సింది వాటి మీద పోరాటం చేసి సాధించాల్సింది ఒక్క కార్యకర్త మాత్రమే అని గుర్తించండి,
ఏ సందర్భం ఐనా సరే ఏ ప్రోగ్రాం చేయాలన్నా సరే నిద్రాహారాలు మానేసి ఇంట్లో వాళ్ళు నీకెందుకు లే అని ఒత్తిడి చేసినా సరే నా పార్టీ నా నాయకుడు నన్ను ఆదేశించాడు నాకు బాధ్యత అప్పచెప్పాడు అని ఒళ్ళు హూనం అయ్యేలా నానా అవస్థలు పడి అంత సిద్ధం చేస్తే మంచిగా వైట్&వైట్ వేసుకొని కరెక్టుగా ఇంకో పది నిమిషాలు ఉంది అనేసరికి ఒక పదిమంది బజనపరులను వేసుకొని రెండు కార్లలో దిగి ఒక గంట హడావిడి చేసేవాడు మీకు నమ్మకస్థుడు వాడే పార్టీకి విధేయడు అని నమ్ముతారు


ఇదంతా చేసినోడు ఎంత తగలేసాడు ఎంత కష్టపడ్డాడు అనేది మీ వరకు రాదు వాడి పేరు కూడా ప్రస్తావనకు రాదు వాడు మాత్రం ఆ నాయకుడు మాట్లాడుతుంటే కొన్ని కోట్లు ఇస్తే కూడా రాని ఆనందంతో మురిసిపోతుంటాడు
ఇలా ఈరోజు తెర మీద ఉన్న అన్నీ పార్టీలు ఎంతో మందికి సముచితస్థానం కలిపించి బాగా ఆర్ధికంగా అంగబలంతో ఎదుగుదలకు కృషి చేసి వారిని అవకాశవధులుగా మార్చింది


తప్పు మేము కాదు సార్ మీరు చేసింది
మేము ఎంచుకునే నాయకుడు మమ్మల్ని నడిపించే వాడు ఒకడు ఉంటాడు కానీ మీరు గుర్తించే వాడు ఒకడు అవుతాడు,నిజజీవితంలో వాడు ఎక్కడా కూడా ప్రత్యేకంగా తెర మీద కనపడడు


ఈరోజు ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా కావడానికి కారణం మీరే మీరు చేసిన తప్పిదాలే
గుడ్డలుచించుకొని పని చేసేవాడు మీకు లో ప్రొఫైల్ అయ్యి ఉండొచ్చు గుడ్డలు నలగకుండా ఉండేవాడు మీకు హై ప్రొఫైల్ మీరు వాడినే గుర్తిస్తారు వాడు మీకు పంగనామాలు పెట్టి వాడి స్వార్ధం వాడు చూసుకుంటాడు


ఇప్పటికైనా మీరు మీ పార్టీల మనుగడ ప్రశ్నార్ధకం కాకూడదు అనుకుంటే పార్టీ అంటే ప్రాణంగా భవించేవాడిని గుర్తించండి వాడి ఎదుగుదలకు కృషి చేయండి
సంపాదించింది మేము రాజకీయాల్లోకి వొచ్చింది ప్రజలకు సేవ చేయడానికి అని ఎదవ సొల్లు కబుర్లు చెప్పే ఎదవలని ఆమడ దూరంలో పెట్టండి....


నమ్ముకున్న పార్టీ ఆగమైతుంటే దాన్ని ఎలా దారిలోకి తెచ్చుకోవాలి ఏం చేస్తే మనం బ్రతికించుగోలం అనే దిక్కుతోచని స్థితిలో ఒకవిధమైన సందిగ్ధంలో ఉన్నాం.