చరిత్ర లోని సారమిదే

 


చరితలోని సారమిదే,


భవితలోని భావమిదే,


వీర విజయ గాధలకు
మూలసారమిదే....నేస్తం
వందేమాతరం అంటుంది మాతరం
వీరం,శౌర్యం, శాంతం కలగలిపిన
మాతరం వందేమాతరం....నేస్తం
ఝాన్సీరాణి, రుద్రమల 
కత్తుల కథలే వందేమాతరం....నేస్తం
మనలోని అనైక్యత, సంస్కార విహీనత
ఆసరాగా తీసుకుని, విద్వేషం రగిలించి
విభజించి పాలించ,విద్రోహం తలపెట్టే
ఫిరంగి మూక బ్రిటిషు విషతంత్రాలకు
విరుగుడు మంత్రం మా వందేమాతరం
ఎన్నాళ్లీ ఈవేదన ,ఎన్నాళ్లీ ఈరోదన
తల్లి రుణం తీర్చుకొనే తనయులమై
మనం ,పొరుగు వారి పొరపాట్లను
అణచివేసే రధసారధులమై
విద్రోహుల గుండె చీల్చి, 
విజయశంఖ మెత్తి పాడు
నమోనమం మాతరం వందేమాతరం...