బాలికపై అత్యాచారం

 


నాదెండ్ల లో మైనర్ బాలికపై అత్యాచారం..


 పిల్లలను ఆడించెందుకు వచ్చిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ ప్రబుద్ధుడు...


 ఆ బాలిక ఇప్పుడు8 నెలల గర్భిణీ..


అమరావతి :
ఆయనకు పెళ్లయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు. 


ఆ పిల్లలను ఆడించేందుకు ఇంటికి వచ్చిన 15 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడి గర్భిణిని చేశాడు ఓ ప్రబుద్ధుడు. 


సభ్యసమాజం తలదించుకునేలా చేసిన ఈ సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం, నాదెండ్ల గ్రామంలో గ్రామంలో వెలుగుచూసింది.


 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అదే ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 


వీరి కుమార్తె ఏడో తరగతి తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు కొనసాగించలేడు. 


సమీపంలో నివాసం ఉంటున్న బోడాల శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి వారి పిల్లలను బాలిక ఆడిస్తూ ఉండేది.


 బాలికపై కన్నేసిన శ్రీనివాసరావు మాయ మాటలతో లోబరుచుకున్నాడు. 


ఈ విషయం  బాలిక ఇంట్లో వారికి తెలియడంతో పెద్దలు పంచాయతీ చేసి శ్రీనివాసరావు ను హెచ్చరించారు. 


తిరిగి సంబంధం కొనసాగిస్తూ ఉండటంతో బాలిక గర్భిణీ అయింది. 


ప్రస్తుతం 8 నెలల గర్భిణి కావడంతో పెళ్ళి చేసుకోవాలని కోరింది. 


ఈ విషయమై ఆదివారం రెండు కుటుంబాల మధ్య చెలరేగింది.


 దీంతో బాధితురాలు వారి కుటుంబసభ్యుల తో కలిసి నాదెండ్ల పోలీసు స్టేషన్ లో సోమవారం పిర్యాదు చేసింది.


 పోలీసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి, చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బారావు ఈ సంఘటన పై విచారించారు.


Popular posts
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సీమాంధ్రుల కలల రాజధాని కోసం ఉద్యమిస్తాం*
Image
రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుం ది
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో