నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపిన కృష్ణ ప్రసాదు గారు
ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని తుమ్మలపాలెం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు కమిటీ నూతన కమిటీ సభ్యులను బుధవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
కమిటీ అధ్యక్షుడు గా నూతలపాటి రవికుమార్, ఉపాధ్యక్షుడు గా పెదర్ల మల్లికార్జునరావు, కార్యదర్శి గా తంగిరేకుల కనకదుర్గారావు మరో 12 మందిని డైరెక్టర్ లు గా ఎన్నుకున్నారు
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు గొల్లపూడి పార్టీ కార్యాలయానికి వచ్చి మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కృష్ణ ప్రసాదు గారు వారికి అభినందనలు తెలిపారు. ఎత్తిపోతల పథకాన్ని రాజకీయాలకు అతీతంగా రైతులందరికీ ఉపయోగపడే విధంగా సమర్థవంతంగా నడుపుకోవాలని సూచించారు
ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్లపూడి, తుమ్మలపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు