మహిళ అంగీకారంతో సహజీవనం చేస్తే...అత్యాచారం కాదు

 


మహిళ అంగీకారంతో సహజీవనం చేస్తే...అత్యాచారం కాదు


సుప్రీంకోర్టు సంచలన తీర్పు


న్యూఢిల్లీ : సహజీవనంపై అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ మహిళ తన అంగీకారంతో సహజీవనం చేసి, అతనితో శారీరక సంబంధం ఏర్పరచుకుంటే అత్యాచారం కిందకు రాదని సుప్రీంకోర్టు ప్రకటించింది. సేల్స్‌టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ అయిన ఓ మహిళ సీఆర్పీఫ్ డిప్యూటీ కమాండెంట్‌తో ఆరేళ్లపాటు సహజీవనం చేశారు. వీరిద్దరూ ఒకరి ఇళ్లలో మరొకరు నివాసముంటూ సహజీవనం చేశారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి బలవంతంగా తనతో శారీరక సంబంధం ఏర్పరచుకొని ఆరేళ్లపాటు సహజీవనం చేసి ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లాడేందుకు నిశ్చితార్థం చేసుకున్నాడని మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు బెంచ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇందిరాబెనర్జీల ధర్మాసనం అత్యాచారం కేసును కొట్టివేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.