యాస్ట్రైడ్ భూమిని తాకనుంది

 


 


ఓ కిల్లర్ యాస్టరయిడ్ భూమిని తాకబోతోంది..!!


ఈ భూతలానికి అంతరిక్షంలోని ఉల్కలు, తోకచుక్కల నుంచి ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా ఓ రాక్షసి ఉల్క (కిల్లర్ యాస్టరాయిడ్) అతి వేగంగా భూమిని తాకి విధ్వంసం సృష్టించే డేంజర్ పొంచి ఉందని నాసా శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఇదేదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోని సీన్స్ మాదిరి కాదని, మన లైఫ్ టైంలో ఏదో ఒక సందర్భంలో వాస్తవంగా జరిగే సంఘటన అని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రై డెన్ స్టెయిన్ 'బాంబు' పేల్చారు. వాషింగ్టన్‌లో జరిగిన ప్లానెటరీ డిఫెన్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన.. ఇది హాలీవుడ్ గురించో, సైన్స్ ఫిక్షన్ మూవీల గురించో కాదన్న విషయాన్ని అంతా గుర్తించాలన్నారు. ఈ భూమిపై మనమింకా ప్రాణాలతో జీవించి ఉన్నామంటే అది ఈ భూతలాన్ని డేంజరస్ ఉల్కలు తాకకపోవడమే అని ఆయన పేర్కొన్నాడు.


2013 ఫిబ్రవరిలో ఉరల్ పర్వత ప్రాంతాల్లో 'పేలిన' ఓ ఉల్క సృష్టించిన వినాశనాన్ని, అలాగే 1908లో టంగుస్కాలో సంభవించిన ఉల్కా ప్రమాదాన్ని ఆయన ప్రస్తావించాడు. ఆ ఘటనలో 1600 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పాడు. ఇది 20 హిరోషిమా అణు బాంబుల కన్నా శక్తిమంతమైనదని బ్రై డెన్ స్టెయిన్ పేర్కొన్నాడు. ప్రతి 60 ఏళ్ళకొకసారి ఇలాంటి సంఘటనలు జరుగుతాయనుకున్నా..గత వంద ఏళ్ళలో ఈ విధమైన ఘటనలు మూడు సార్లు సంభవించాయని ఆయన అన్నాడు. భూమికి దగ్గరగా ఉన్నాయని భావిస్తున్న భారీ ఉల్కలను కనుగొని 90 శాతం ట్రాక్ చేసేందుకు నాసా ప్రయత్నిస్తోందని ఆయన తెలిపాడు..' ఓ ఉల్క భూమిని 'టచ్' చేయడాన్ని మేం ఆపలేం. అయితే దాని తీవ్రతను తగ్గించి..భారీ ప్రాణ, ఆస్తి నష్టం నివారించేందుకు కృషి చేస్తాం అని ఆయన..చివరలో కాస్త చల్లని కబురు చెప్పాడు.