ఓటర్ గుర్తింపు కార్డుకు ఆధార్ అనుసందానం

ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం!
ఒకటి కన్నా ఎక్కువ ప్రాంతాల్లో ఎంతో మందికి ఓటు
వారిని ఏరివేయాలంటే ఆధార్ అనుసంధానమే మార్గం
కేంద్రాన్ని కోరిన ఎన్నికల కమిషన్కొత్తగా ఓటర్ గుర్తింపు కార్డు నిమిత్తం దరఖాస్తు చేసుకునే వారి నుంచి ఆధార్ నంబర్లను సేకరిస్తామని, ఇప్పటికే గుర్తింపు కార్డులు కలిగిన ఓటర్ల నుంచి ఆధార్ నంబర్లను సేకరించి అనుసంధానం చేస్తామని, ఇందుకు తమకు అధికారాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం కోరింది. దేశంలో రెండు, అంతకన్నా ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు ఉన్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, ఈ పరిస్థితి తొలగాలంటే, ఆధార్ అనుసంధానమే మార్గమని ఈసీ అభిప్రాయపడింది. ఆధార్ కార్డు వివరాలు అనుసంధానం చేయాలంటే, 1950 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి మార్పులు చేయాలని గుర్తు చేస్తూ, న్యాయశాఖకు ఈసీ ఓ లేఖను రాసింది. ఆధార్ ను సేకరిస్తే, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటున్న వారిని తొలగించవచ్చని తెలిపింది.