కొత్త ఓటర్లు నమోదుకు అవకాశం

  


ఓటరు నమోదుకు అవకాశం
కొత్త ఓటు నమోదు.. ఓటరు జాబితాల్లోని తప్పిదాల సవరణకు భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా షెడ్యూల్‌ జారీ చేసింది. అయిదు నెలల పాటు కొనసాగున్న ఈ ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గడిచిన పార్లమెంట్‌, ఎంపీటీసీ ఎన్నికల్లో చాలా మంది ఓట్లు గల్లంతు కావడంతో ఇబ్బందులు పడ్డారు. డబుల్‌ ఓట్లు పెద్ద సంఖ్యలో జాబితాల్లో దర్శనమిచ్చాయి. పేర్లు తప్పుగా, చిరునామా తప్పుగా ఉన్న వారు ప్రస్తుతం సవరణలు చేసేందుకు అవకాశం లభించింది. 2020 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకునే వారు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఇది మంచి అవకాశంగా అధికారులు భావిస్తున్నారు.