అరుణ్ జెట్లీ మృతికి సంతాపం


కేoద్రమాజీ మంత్రి అరున్ జైట్లీ మృతికి... సంతాపం


(అమలాపురం -జిఏన్ రావ్ )



అరుణ్‌జైట్లీ మృతి దేశానికి తీరని లోటు : నల్లా పవన్‌కుమార్‌



అమలాపురం :
బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ మృతి దేశానికి తీరని లోటని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్‌కుమార్‌ అన్నారు. శనివారం స్థానిక మాచిరాజువీధిలోని నాలుగు రోడ్ల జంక్షన్‌లో అరుణ్‌జైట్లీ మృతి పట్ల ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పవన్‌కుమార్‌ మాట్లాడుతూ బీజేపీకి ట్రబుల్‌ షూటర్‌ అనదగ్గ నాయకుడు, అపర రాజకీయ చాణక్యుడు అరుణ్‌ జైట్లీ.. తన మూడు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో బీజేపీకి ఏ కష్టమొచ్చినా నేనున్నాంటూ జైట్లీ ట్రబుల్‌ షూటర్‌లా వ్యవహరించారని గుర్తు చేసారు. గతంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన జైట్లీ.. తన వాగ్ధాటితో మన్మోహన్‌ సింగ్‌ నేత త్వంలోని యూపీఏ సర్కారుకు ముచ్చెమటలు పట్టించారన్నారు. అనంతరం నరేంద్రమోదీ నేత త్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తొలిహయాంలో అత్యంత కీలక మంత్రిగా ఉండి.. మోదీ సర్కారు నిలదొక్కుకోవడంలోనూ కీలక పాత్ర పోషించారని అన్నారు. 1952 డిసెంబర్‌ 26న ఢిల్లీలో జన్మించారని, 1973లో ఢిల్లీ యూనివర్శిటీ నుంచి లా డిగ్రీ, 1974లో ఢిల్లీ యూనివర్శిటీలో విద్యార్థి సంఘ అధ్యక్షులుగానూ, 1975లో ఎమర్జన్సీ సమయంలో 19 నెలలు జైలు శిక్ష అనుభవించారన్నారు. 1977లో ఏబీవీపపీ జాతీయ కార్యదర్శిగానూ, 1980లో భారతీయ జనతా పార్టీలో చేరారన్నారు. 1991లో బీజేపీ జాతీయ ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారన్నారు. 1999లో సమాచార, ప్రసారశాఖామంత్రిగా, 2009లో రాజ్యసభలో విపక్షనేతగా, 2000లో రాజ్యసభకు ఎంపిక, న్యాయ శాఖామంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారన్నారు. 2006లో రాజ్యసభకు రెండోసారి ఎంపిక, 2012లో మూడోసారి రాజ్యసభకు ఎంపిక, 2014లో ఆర్థిక శాఖ, కార్పొరేట్‌ అఫైర్స్‌, రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టారన్నారు. 2018లో ఢిల్లీలోని  ఎయిమ్స్‌లో కిడ్నీ ట్రాన్ప్‌ప్లాంట్‌ సర్జరీ అయ్యిందని, అనారోగ్యం కారణంగా ఈ ఏడాది ఆగస్టు 9న ఎయిమ్స్‌లో చేరారన్నారు.  జనసంఘ్‌లో కీలకపాత్ర పోషించారని, వాజ్‌పేయ్‌ హయంలోనూ పౌర సరఫరాల శాఖామంత్రిగా, మోడీ హయాంలో ఆర్థిక మంత్రిగానూ పార్టీకి, దేశానికి ఎనలేని సేవలందించారని అన్నారు. అమలాపురం పట్టణ ప్రముఖ్‌ దేవాదుల సూర్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మజ్దూర్‌మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వీరబాబు, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి గనిశెట్టి అరవింద్‌, పట్టణ ఉపాధ్యక్షులు కాటా బాలయ్య, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంగా రాజేంద్రకుమార్‌, సలాది నాగేశ్వరరావు, అరిగెల నాని, అయ్యల బాషా, ఈశ్వర్‌గౌడ్‌, కాశిన ఫణి తదితరులు పాల్గొన్నారు.