మణిక్రాంతి కుటుంబాన్ని పరామర్శించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ

 


విజయవాడ:  దారుణ హత్యకు గురైన మణిక్రాంతి కుటుంబాన్ని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరామర్శించారు.  భార్య తల నరికి తలతో వీధుల్లో తిరిగాడంటే అతనిలో ఎంత రాక్షసత్వం ఉందో అర్థమవుతుందన  వాసిరెడ్డి పద్మ అన్నారు. ఇలాంటి మృగాళ్లను కఠినంగా శిక్షించాలన్నారు. హతురాలు మణిక్రాంతి గతంలో ప్రదీప్‌‌పై ఫిర్యాదు చేసిందని, పోలీసులు పట్టించుకుంటే ఈ హత్య జరిగేది కాదని అభిప్రాయపడ్డారు. ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవని పోలీసులు అంచనా వేయలేకపోయారన్నారు. తల కనబడకపోతే కేసు పెద్దగా నిలబడదని పక్కా వ్యూహంతోనే హత్య చేశాడని పేర్కొన్నారు. ఈ ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్తామని పద్మ చెప్పారు. వీలైనంత త్వరగా నిందితుడికి శిక్ష పడాలని అన్నారు.