చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఫేస్-2లో కెమికల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం 


హైదరాబాద్‌: చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఫేస్-2లో అగ్నిప్రమాదం సంభవించింది. రెండు గంటలుగా భారీగా మంటలు, దట్టమైన పొగ ఎగిసిపడుతోంది. మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, కుషాయిగూడ పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చర్లపల్లి పారిశ్రామికవాడలో తరుచూ ప్రమాదాలు జరుగుతుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. దట్టమైన పొగ ఎగిసిపడుతుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.