డిప్యూటేషన్లు రద్దు

 


డిప్యుటేషన్లు రద్దు- డీఈవో రాజ్యలక్ష్మి
పోర్టురోడ్డు,: పనిసర్దుబాటు ప్రక్రియలో భాగంగా ఇటీవల జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన డిప్యుటేషన్లు రద్దు చేస్తూ డీఈవో రాజ్యలక్ష్మి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. డిప్యుటేషన్లు పొందిన వారంతా తక్షణమే ప్రస్తుత స్థానాలను వదిలిపెట్టి వారి పూర్వ స్థానాల్లో విధుల్లో చేరాల్సి ఉంది. ఆదేశాలు పాటించని పక్షంలో వారిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మండల పరిషత్‌ యాజమాన్యం కింద పనిచేస్తున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత తరగతులు బోధించే ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్లు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలుగా పదోన్నతులు పొందేందుకు సీనియార్టీ జాబితా విడుదల చేశామన్నారు. డీఈవో వెబ్‌సైట్‌లో జాబితాను పొందుపరచినట్లు తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు విద్యాశాఖాధికారి కార్యాలయానికి తగిన ఆధారాలతో హాజరుకావాలని చెప్పారు.