10వ తేదీ వరకు తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం

 


ఈ నెల 10 వ తేదీ వరకు trs పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొనసాగించేలా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు అనుమతించారని మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం trs పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వం పై గోషామహల్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కో నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వ నమోదు లక్ష్యంగా ఇవ్వడం జరిగిందని వివరించారు. ఈ నెల 6 వ తేదీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ ghmc పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. అందరూ సమన్వయంతో వ్యవరించి లక్ష్యాన్ని సాధించాలని కోరారు. ఈ సమావేశంలో  నియోజకవర్గ ఇంచార్జి నంద కిషోర్, వెంకటేష్ గౌడ్, కార్పొరేటర్లు మమతా సంతోష్ గుప్తా, పరమేశ్వరి, ముకేశ్ సింగ్, నాయకులు ధనశేఖర్, శాంతిదేవి తదితరులు పాల్గొన్నారు.