మంత్రి అనిల్ కుమార్ అలిగారా?

 


 


ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అలిగారా ?


అవుననే అంటున్నారు ఆయన ఆంతరంగికులు. 


పేరుకి ఎంతో ప్రాధాన్యత కలిగిన శాఖని తనకి అప్పజెప్పినా, పోలవరం, తెలంగాణా మీదుగా శ్రీశైలానికి గోదావరి జలాల తరలింపు వంటి కీలకమైన విషయాల్లో తనని సంప్రదించకపోగా, విధాన నిర్ణయాలన్నీ ఒకే సామాజికవర్గానికి చెందిన సిఎం గారి ఆంతరంగిక మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారని, పత్రికల్లో చూస్తే తప్ప తనకి అవి తెలియట్లేదని మంత్రిగారు వాపోతున్నారట. 


ఆఖరికి పోలవరం రివర్స్ టెండరింగ్ ఎందుకు సహేతుకమో ప్రధానిని కలిసి వివరించడానికి  సిఎం గారితో పాటుగా ఈరోజు దిల్లీ వెళ్ళే మంత్రుల జట్టులో ఇరిగేషన్ శాఖామాత్యుడైన తన పేరే లేకపోవడం, వెళ్తున్న జట్టులో అందరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు ఉండడం తనకి అవమానకరంగా ఉందని మంత్రిగారు సన్నిహితులవద్ద మథనపడ్డారని భోగట్టా. 


ఒక బీసీ మంత్రిని ఇలా అవమానిస్తారా అని మండిపడుతున్నారని వార్తలొస్తున్నాయి. 


 


Popular posts
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
వైసీపీ లో చేరికలు