రోజుకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారు

వైసీపీ ప్రభుత్వం వచ్చాక సగటున రోజుకొక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారు.  


చెప్పాలంటే ఇంకా ఎక్కువే. ప్రభుత్వం వచ్చిన రెండునెలల్లోనే 90 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా, ఉచితబోర్లు అంటూ మాటలతో ఊదరగొట్టడం తప్పించి రైతుకు ప్రభుత్వం అండగా ఉందన్న భరోసా కల్పించలేక పోతోంది. విత్తనాల క్యూలో కూడా రైతు మరణాలు చోటుచేసుకోవడం దురదృష్టకరం. వైసీపీ వచ్చాక తెలుగుదేశం పథకాలన్న కారణంతో రుణమాఫీ ఆపేశారు. అన్నదాత సుఖీభవ ఆపేసారు. రైతు భరోసా ఇప్పుడు కాదన్నారు. దీంతో పంట కోసం చేసిన అప్పులు తీర్చలేక అన్నదాతలు తమ చేతులతో తామే ఉసురు తీసుకుంటున్నారు.


అమరావతి కాంట్రాక్టర్ల వల్లే ఆగిందంట. తెదేపా ఓడిపోగానే కాంట్రాక్టర్లు కూడా వెళ్ళిపోయారంట. అంటే వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లని అంతగా వేధించిందా? లేక వోక్స్ వ్యాగన్ వాళ్ళను  కమిషన్ల కోసం వేధించి రాష్ట్రం నుంచి పారిపోయేలా చేసిన బొత్సగారి గత చరిత్ర తెలిసి కాంట్రాక్టర్లు భయపడి పారిపోయారా? ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు ఉన్నాయి బొత్సగారి కబుర్లు. 
 
కియా వైఎస్ఆర్ వల్లే వచ్చింది... ప్రజలు తినట్లేదు కాబట్టి అన్న క్యాంటీన్లు మూసేసాం... అమరావతి కాంట్రాక్టర్ల వల్లే ఆగింది... ఇలాంటి చచ్చు మాటలు మాట్లాడితే నమ్మడానికి జనాలెవరూ చెవుల్లో పూలుపెట్టుకు లేరు. చేసిందంతా చేసి 'సొమ్ములు పోయాయి, ఏం చేస్తాం' అని అప్పుడు ఆడిన నాటకాలు ఇప్పుడు కుదరవు. అమరావతి మీ వల్లే ఆగింది.