టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోల్‌మాల్..
నిధుల గోల్‌మాల్, అక్రమాలు, అవకతవకలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు చేపట్టింది.
రూ. 4 కోట్ల మేర అక్రమాలు, అవకతవకలపై ఫిర్యాదులు అందాయి.
రోజువారీ పూజలకు అవసరమైన పూలు, ఇతర వస్తువుల సరఫరా కాంట్రాక్టర్ల నుంచి అధికారులకు ముడుపులు. ప్రత్యేక పూజలు, పర్వదినాల్లో చేపట్టే కార్యక్రమాల్లోనూ అక్రమాలు. ఆధారాలతో సహా టీటీడీకి ఫిర్యాదు చేసిన భక్తుడు. ఫిర్యాదులపై తొలుత టీటీడీ విజిలెన్స్ అధికారుల విచారణ చేశారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషన్ ప్రవీణ్ ప్రకాశ్ జోక్యంతో నిలిచిన విచారణ. దీంతో నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విజయసాయి రెడ్డికి ఫిర్యాదు చేసిన భక్తుడు. అవకతవకల నిగ్గు తేల్చాల్సిందిగా రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కి అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం. రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు. రెండ్రోజులుగా ఢిల్లీలోని ఏఈఓ కార్యాలయంలో రికార్డుల తనిఖీలు.