వరదల కారణంగా 4 వేల కోట్ల పంట నష్టం జరిగింది

 


వరదల కారణంగా 4 వేల కోట్ల పంట నష్టం జరిగింది.


గోదావరి, కృష్ణా వరద బాధితులని ఆదుకునేందుకు సమీక్ష కూడా చేయని జగన్


*పనులపై జగన్ ప్రభుత్వం పక్క రాష్ట్రాల అధికారులపై విజిలెన్స్ ఎన్స్‌ఫోర్స్‌మెంట్ వేయడం హాస్యాస్పదం.


*టీడీపీ హయాంలో జరిగిన పనులన్నీ పారదర్శకమే అన్నీ కేంద్రమే కితాబిచ్చింది


*ఏపీలో అభివృద్ధి వదిలేసి.. హైదరాబాద్ అభివృద్ధి కోసం కష్టపడుతున్న సీఎం జగన్


*ఆంధ్రప్రదేశ్‌ను అయోమయాంధ్రప్రదేశ్‌గా మార్చిన జగన్‌ప్రభుత్వం


*అమరావతి ప్రాంత ప్రజలపై ముఖ్యమంత్రి జగన్‌కి ఎందుకంత కోపం*


*రాజధానిపై మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతుంటే సీఎం ఎందుకు స్పందించరు*


*కృష్ణా డెల్టా రైతాంగానికి నీరు ఇవ్వకపోడం ప్రభుత్వ అసమర్థత* 


*పడవను తీయటానికి రివర్స్ టెండరింగ్ లో వద్దన్న బెకమ్ సంస్థ సహాయం అవసరమైంది ఈ ప్రభుత్వానికి!*


*మన తెలుగమ్మాయి పీ.వీ. సింధు ప్రపంచ చాంపియన్‌గా నిలవడం మనకు గర్వకారణం*


_విజయవాడ, ఆటోనగర్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ  వరదల కారణంగా సుమారు 4వేల కోట్ల రూపాయల మేర నష్టం జరిగింది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదం వల్లే నేడు రైతులు, ప్రజలు నష్టపోయారు. గోదావరి, కృష్ణా వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కనీసం సమీక్ష కూడా చేయలేదు. ఎగువ ప్రాంతాలలోని క్యాచ్‌మెంట్ ఏరియాలో భారీ వర్షపాతం నమోదైంది. ఇస్రో, ఐఎండీ, కేంద్రం అందరూ హెచ్చరించినా మన ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు వరదల మానిటరింగ్‌లో ఉద్దేశపూర్వకంగా నష్టం చేశారు. నష్టపోయిన రైతులు, ప్రజలను అమెరికా నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కనీసం పరామర్శించలేదు. బాధితులను ఎలా ఆదుకుంటారో కూడా ప్రభుత్వం ప్రకటన చేయకపోవడం అన్యాయం. 304 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లింది, అయినా రైతాంగానికి నీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమయ్యింది. కృష్ణాడెల్టా రైతాంగానికి నీరు ఇవ్వకపోవడం ప్రభుత్వ అసమర్థత.  రైతాంగం మీద సీఎం ఎందుకు కక్షగట్టారు. ఇంతవరకు వరద నష్టపరిహారంపై అంచనాలు కూడా రూపొందించలేదు, బాధితులను ఎలా ఆదుకుంటారో ప్రభుత్వం ప్రకటన చేయకపోవడం అన్యాయం. వరద బాదితులను ఆదుకోవడం కన్నా ముఖ్యమంత్రి జగన్ గారికి ఢిల్లీ పర్యటన ఎక్కువైంది._


_ప్రకాశం బ్యారేజీ వద్ద పడవ తీయడానికి ఎందుకు ఆలస్యం చేశారు, 10 రోజులు పడవను తీయలేక, బెకం సంస్థ అధికారుల సహాయం అవసరమైంది మీకు, రివర్స్ ప్రభుత్వం వద్దన్న పోలవరం పనుల్లో కీలకపాత్ర పోషిస్తున్న బెకం సంస్థ సహాయం ప్రభుత్వానికి తీసుకోక తప్పలేదని విమర్శించారు. పడవ మూలంగా 3 టీఎంసీల నీరు సముద్రం పాలుకావడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. రివర్స్ టెండరింగ్‌పై హైకోర్టు స్టే, పోలవరం ప్రాజెక్టు అథారిటీ   కేంద్రానికి నివేదిక సమర్పించినా.. పోలవరం పనులపై జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారుల మీద  విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వేయడం హాస్యాస్పదం. శశిభూషణ్, ఆదిత్యనాథ్ దాస్, జోషి వంటి పక్క రాష్ట్రాల అధికారుల మీద విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ ఎలా వేశారు. పీపీఏ కనుసన్నల్లో, కేంద్ర జలవనరుల శాఖామంత్రి  గడ్కరీ చేతులమీదుగా చాలా ఉత్తమ ప్రాజెక్టుగా అవార్డు అందుఉన్న ప్రాజెక్టు మీద విజిలెన్స్ విచారణ ఎలా వేశారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో జరిగిన పనులన్నీ పూర్తి పారదర్శకంగా ఉన్నాయని కేంద్రమే కితాబిచ్చింది. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు పనులు ఆలస్యం, ఖర్చు పెరగడం తప్ప ప్రయోజనం ఏమీ లేదు.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గారు మీ తండ్రి వైఎస్ హయాంలో జరిగిన పోలవరం పనులపై విచారణ ఎందుకు చేపట్టరని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో పోలవరం ప్రాజెక్టుపై  పెరిగిన 2500 కోట్ల వ్యయం పీఠర్ కమిటీకి, జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి కనబడదని, 2005, 2006లో జరిగిన పనులు కనబటం లేదని ప్రశ్నించారు._


_వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిపై కేసులు వేయించారని, అమరావతి భ్రమరావతి అంటూ మాపై విమర్శలు చేశారు. అమరావతిలో ఇప్పటికే భారీ నిర్మాణాలు చేపట్టారని, అక్కడే అభివృద్ధి చేయాలని  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సూచించింది,  ముఖ్యమంతి జగన్మోహన్‌రెడ్డి గారు ప్రధానిని కలిసిన అమరావతి కోసం ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. నేడు ఆంధ్రప్రదేశ్‌ను అయోమయాంధ్ర ప్రదేశ్‌గా జగన్మోహన్‌రెడ్డి మార్చారు. తెలుగు వారికి ఒక రాజధాని ఉండకూడదా అని ప్రశ్నించారు, రాజధాని రైతులు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తావుంటే ఎందుకు సమాధానం చెప్పరు, ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ది వదిలేసి,  హైదరాబాద్ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కష్టపడుతున్నారు. అమరావతి ప్రాంత ప్రజలపై ముఖ్యమంత్రి జగన్‌కి ఎందుకంత కోపమని ప్రశ్నించారు._


_రాజధానిపై మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి జగన్ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. నేను విన్నాను, నేను ఉన్నాను అని ఓట్లు వేయించుకున్నారు.. అధికారం రాగానే  ఉన్నా.. విన్నా.. చీమ కుట్టినట్లుగా కూడా ముఖ్యమంత్రికి లేదు._


_భూగర్భజలాలు విషయంలో నీతి ఆయోగ్ మనకు ఇచ్చిన 74 పాయింట్లతో దేశంలో రెండవ స్థానంలో ఉన్నామని అవార్డు దక్కిందని, దీని గురించి చెప్పుకోలేని పరిస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందన్నారు. జలవనరుల సంరక్షణలో మన రాష్ట్రానికి రెండవ స్థానం ఇచ్చారు. 2017-18లో రాష్ట్ర ఇరిగేషన్‌కు శాఖ ఎన్నో అవార్డులు దక్కించుకుందని,  నీరు-చెట్టు దేశంలో ఆదర్శంతమైన పథకమని నీతి ఆయోగ్ చెబితే వైసీపీ వారు నాకేశారు, దొబ్బేశారని మాట్లాతున్నారు. ఇరిగేషన్‌లో 55వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి దేశంలో మొదటి రెండు స్థానాల్లో నిలిపితే ఈ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో ఏ ప్రాజెక్టులో అయినా ఒక బొచ్చ కాంక్రీట్ వేశారా అని ప్రశ్నించారు._


_మన తెలుగమ్మాయి పి.వి.సింధు ప్రపంచ చాంపియన్‌గా నిలవడం మనకు గర్వకారణం, గతంలో క్రీడలకు చంద్రబాబు గారు స్థలం ఇస్తే మీరు కోర్టులలో కేసులు వేశారని, ఈ రోజు సింధును చూసి దేశం అంతా గర్వపడుతుంది, సింధుకు, ఆమె కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు._