వెనుకబడిన వారికి వెన్నుపోటు

 


 


జగన్మోహన్ రెడ్డి దేశంలో లేని వేళ అదునుచూసి, CS, ముఖ్య సలహదారు కలసి SC/ST లకు వెన్నుపోటు పొడిచి వారికి కేటాయించిన కోటాను  ముఖ్యమంత్రి అయి 3నెలలు కాకముందే ఆయనను బ్రష్టు పట్టించే కార్యక్రమానికి పాల్పడ్డారు...


 సబ్జెక్టు పూర్తిగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలోనిది... ఇది అతి ముఖ్యమైన రూల్ ఆఫ్ రిజర్వేషన్ల విషయం... SC/ST లకు రిజర్వ్ చేసిన పోస్టులు వేరే వాళ్ళ తో భర్తీ చేయవచ్చా ? లేదా ? అనే అతి ముఖ్యమైన విషయం పై గడచిన 3 సంవత్సరాలుగా ఒక ఫైల్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, GAD, Law, Advocate General చుట్టూ తిరిగి Ex CM వద్దకు వెళ్లి ఆయన దగ్గర 76 రోజులు పెండింగ్ ఉన్న తర్వాత ఆయన ఏ నిర్ణయం తీసుకోకుండానే discuss అని రాసి తిప్పి పంపిన తర్వాత, ఆ ఫైల్ మళ్ళీ ఇప్పుడు circulation దశలో ఉండగానే... అసలు (main file) ఫైల్ తో సంబంధం లేకుండా కొంతమంది వ్యక్తులు ఇచ్చిన representation పై రూల్ ఆఫ్ రిజర్వేషన్ల తో సంబంధం లేని GAD కొత్త ఫైల్ ను move చేసి CM దేశంలో లేని వేళ కోటాకు తూట్లు పొడుస్తూ చక్రం తిప్పిన వ్యక్తి CS... అందుకు సమ్మతించినది ముఖ్య సలహాదారు... 


దారుణమైన విషయం ఏమిటంటే SC కేటగిరీలో adequacy లేదని మూడేళ్ళుగా నిర్ణయం కొరకు ఒక ఫైల్ నడుస్తూ ఉంటే adequacy ఉందని CS దారుణమైన తీర్పులు రాస్తాడు... కనీసం ఫైల్ పై సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, finance డిపార్ట్మెంట్ remarks తీసుకోవాలని తెలియని వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి అధిపతి గా ఉండటం సిగ్గుచేటు... దీనిని రాష్ట్రంలో ఉన్న అన్నీ SC/ ST సంఘాలు తీవ్రంగా ఖండించాలి...


SC/ST లకు జరుగుతున్నఈ అన్యాయాన్ని ముఖ్యమంత్రి Y S జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి సాధ్యమైనంత త్వరగా తీసుకెళ్ళాలి... లేకపోతే SC/ ST లు తీవ్రంగా నష్టపోతారు... SC/ ST లకు రిజర్వ్ చేసిన కోటా వారితోనే భర్తీ చేయాలి.


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి