అమరావతిని కదిలించొద్దు - కన్నాకు రైతుల విజ్ఞప్తి

అమరావతిని కదిలించొద్దు!
భాజపా అధ్యక్షుడు కన్నాకు రైతుల విజ్ఞప్తి


గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని మార్చేస్తారంటూ పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమరావతి రాజధాని ప్రాంతరైతులు భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. 


గత ప్రభుత్వం అడిగితేనే తమ భూములు ఇచ్చామని, ప్రభుత్వం మారిన తర్వాత ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 


మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని వాపోయారు. 


రాజధానిలో పనులు పూర్తిగా ఆగిపోయాయని, భూములిచ్చిన రైతులకు ఇప్పుడు కౌలు కూడా ఇవ్వడం లేదని ఆయన దగ్గర వాపోయారు. 


సీఆర్‌డీఏ అధికారులను కలిసినప్పటికీ వాళ్లు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని కన్నా దృష్టికి తీసుకెళ్లారు.


రాజధాని అమరావతిని మార్చకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి