కార్డుల కలకలం

కార్డుల కలకలం..


రేషన్‌ కార్డు ప్రభుత్వ ఉద్యోగి పేరుతో వుంటే మాత్రం వెంటనే కార్డును సరండర్‌ చేయాలని, ఒకవేళ తండ్రి పేరిట వున్న తెల్ల కార్డులో, ప్రభుత్వ ఉద్యోగి అయిన కుమారుడు వుంటే, వెంటనే పేరు తొలగించుకోవాలని...తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు యథావిధిగా రేషన్‌ పొందవచ్చునంటూ ఆయా కార్డు యజమానులకు చెప్పాలని పౌరసరఫరాల శాఖ అధికారులు రేషన్‌ డీలర్లను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా రేషన్‌ కార్డులను సరండర్‌ చేయడం లేదా పేర్లు తొలగించుకోకపోతే క్రిమినల్‌ చర్యలు, అవసరమైతే ఆర్‌ఆర్‌ యాక్టు అమలు చేస్తామన్నారు. ఆయా ప్రభుత్వ ఉద్యోగులు మీసేవ కేంద్రానికి వెళ్లి పేర్లు తొలగించుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు.