అంగన్వాడీ అక్రమాల వాడి

 


అంగన్ వాడీ అక్రమాల ఒడి


పేరపాటితిప్ప అంగన్వాడీ కేంద్రలో రెండు సంవత్సరాలుగా పిల్లలు లేకనే మాచర్ల పదమ్మ  కేంద్రాన్ని నడుపుతూ వచ్చిన సరుకులను సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారన్న ఫిర్యాదు మేరకు సూపర్వైజర్ జ్యోతి విచారణలో అవకతవకలపై స్థానికులు గళమెత్తారు .


జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించకపోవడాన్ని తప్పుబట్టారు .రెండు సంవత్సరాలుగా పిల్లలు లేకపోయినప్పటికీ కేంద్రాన్ని నడుపుతున్నా అధికారులు తనిఖీలు  చేపట్టకపోవడమే అవినీతికి ,నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు ఆరోపించారు .విచారణ చేపట్టిన అధికారులు పారదర్శకంగా నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించి చర్యలు తీసుకోవాలని లేకుంటే ఆందోళన చేపడతామన్నారు