ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి పిలుపు
ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి ఆశా వర్కర్లు, బ్రాందీ షాపు కార్మికులు పిలుపు ఇవ్వడంతో తాడేపల్లిలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్సైజు నూతన పాలసీకి సంబంధించి బ్రాందీ షాపులు ఇకపై ప్రభుత్వమే నిర్వహించాలనుకుంటున్న నేపథ్యంలో బ్రాందీ షాపులకు కోత విధించి, అందులో పనిచేసేవారికి, విద్యార్హత నిబంధన తేవడంతో వారంతా ఆందోళన బాట చేయడానికి నిర్ణయించుకున్నారు. 

 

అదే సమయంలో ఆశా వర్కర్లు కూడా తమ సమస్యలపై నిరసన తెలియజేయడానికి వస్తున్న నేపథ్యంలో వారిని విజయవాడ ధర్నా చౌక్‌కు వెళ్లే విధంగా పోలీసులు చర్యలు చేపట్టారు.