విజయవాడ, విశాఖపట్నం నగరాల మధ్య త్వరలో ఉదయ్
 

 

హైదరాబాద్ : విజయవాడ, విశాఖపట్నం నగరాల మధ్య త్వరలో డబుల్‌డెక్కర్ రైలు నడవనుంది. ఈ నెల 26 వ తేదీన ఈ సర్వీస్ ప్రారంభం కానుంది. దీనిని ఉడయ్ సర్వస్‌గా వ్యవహరించనున్నారు. రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ ఈ సర్వీస్‌ను ప్రారంభించనున్నారు. విశాఖపట్నం నుంచి ప్రతీరోజు ఉదయం 5-45 గంటలకు బయలుదేరి 11.15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. విజయవాడలో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖ చేరుకుంటుంది.  ఉదయ్ ఎక్సప్రెస్ ట్రయల్ రన్ ఇప్పటికే జరిగింది. దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి స్టేషన్‌లలో ఈ రైలు ఆగుతుంది.