ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్వాకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 


హరియాణ రాష్ట్రం లోని ఫరీదాబాద్‌ జిల్లా ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం ఒకటి తాజాగా వెలుగు చూసింది. రోడ్డుప్రమాదంలో కాళ్లు కోల్పోయిన వ్యక్తి విషయంలో.. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది రాక్షసుల్లా ప్రవర్తించిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. తెగిన కాళ్లనే రోగికి దిండుగా మార్చి సిబ్బంది ఆపరేషన్‌ గదికి తీసుకెళ్లింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్వాకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.