స్పందన కార్యక్రమం ను నీరుగారుస్తున్న అధికారులు

కాకినాడ : సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమం ఉన్నతాధికారుల అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా నీరుకారుతోంది. దీంతో ప్రభుత్వంపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సామాన్య ప్రజలకు తమ సమస్యలు పరిష్కారంకాక ఇదేం స్పందనరా బాబూ అంటూ నిట్టూరుస్తూ నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రతీ సోమవారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమమే అందుకు ఉదాహర