ఈ ప్రభుత్వం పెన్షన్ అందరికి ఇస్తుందా

ప్రతి నెలా ఒకటో తారీఖునే లబ్దిదారులకు పింఛను పంపిణీని చేపడతారు. ఇందుకు కావలసిన నిధులను ముందు నెల చివరి తారీఖునే పంచాయితీలకు జమ చేస్తారు. అయితే  చాలా మండలాల్లో జులై 31న 100శాతానికి బదులు 60 శాతం నిధులనే జమచేశారు. మిగిలిన 40 శాతం నిధులను త్వరలో ఇస్తామని చెబుతున్నా...  పింఛనుదారుల్లో వందలో నలభై మందికి పింఛను ఎప్పుడొస్తుందో... అసలు వస్తుందో రాదో అంటూ లబ్ధిదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే 3000 పింఛను అనుకుంటే అందులో రూ.750లు కోత పెట్టిన వైసీపీ ప్రభుత్వం... లబ్ధిదారుల్లో కూడా 40 శాతం మందికి కోత పెట్టడం చూసి ఇదేం కోతల ప్రభుత్వం అనుకుంటున్నారు. కొత్తగా 5 లక్షల మందికి పింఛన్లు అని ప్రచారంలో ఆర్భాటం చేసుకుంటున్న ప్రభుత్వం పాత ఫించన్లనే ఇవ్వలేకపోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.