నూతన వాహనాలు చట్టం. 1. నుండిఅమలు.. పట్టణ సి ఐ. సురేష్ బాబు

నూతన వాహనాలు చట్టం. 1. నుండిఅమలు.. పట్టణ సి ఐ. సురేష్ బాబు


(అమలాపురం -జి ఏన్ రావ్ )ట్రాఫిక్ నిబంధనలు పాటించండి


సెప్టెంబరు ఒకటో తేదీనుండి అమలులోకి వస్తున్న నూతన వాహన చట్టంపట్ల అవగాహన కల్పించేందుకు అమలాపురం పట్టణ పోలీసులు నడుం బిగించారు. ఈరోజు ఉదయం పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారితోపాటు మద్యం సేవించి వాహానాలను నడిపినవారికి పోలీసులు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించారు... ఈ సందర్భంగా పట్టణ సర్కిల్ ఇన్స్ పెక్టర్ సురేష్ బాబు  మాట్లాడుతూ ఇప్పటివరకూ ఉన్న వాహన చట్టాన్ని కేంధ్ర ప్రభుత్వం సవరణలు చేసి కఠినతరం చెసిందని అన్నారు .. ప్రజలు ఈచట్టం పట్ల అవగాహన కలిగి ప్రమాదాల నివారణకు సహకరించాలని...అమలాపురం పట్టణాన్ని ప్రమాదరహిత పట్టణంగా చేయాలన్నదే తమ లక్ష్యమని అన్నారు.. ..అలాగే పట్టణ ట్రాఫిక్ ఎస్ ఐ సురేష్ బాబు మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని...నిబంధనలు పాటించనివారిపెై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు... ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ ఐ వి. శ్రీనివాస్ ...సిబ్బంది ...వాహనదారులు పాల్గొన్నారు...