మల్లెల పద్బానాభం అంతిమ యాత్రలో ఎంపీ, ఎమ్మెల్యే


 


మల్లెల అనంత పద్మనాభరావు గారి అంతిమ యాత్ర లో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు


ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు మల్లెల అనంత పద్మనాభరావు గారు బుధవారం తెల్లవారుఝామున కన్నుమూశారు. గురువారం ఉదయం అంతిమ యాత్ర నిర్వహించారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని కూడా పాల్గొన్నారు.  ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు యంపి కేశినేని నాని గార్లు అంతిమ యాత్ర లో పాల్గొని పాడెను భుజంపై మోస్తూ అంతిమ యాత్ర లో ముందుకు సాగారు


మైలవరం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జనం తరలి వచ్చి పద్మనాభరావు గారి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి అంతిమ యాత్ర లో పాల్గొన్నారు